ఇది కన్నీరా ??..వదలని ప్రాణ నేస్తమా??

I did this sketch veryyy long back..almost nine years...but i love it..so much :D
 అసలు ఇది  పెట్టాలి అని చాలా సార్లు అనుకున్నా...కానీ ఎప్పుడు సందర్భం రాలేదు..
మొన్న జ్యోతి  గారు  రాసిన  కవిత  చదివాకా  నా ఫీలింగ్స్ లాగా అనిపించాయి...
తెగ నచ్చేసి   నా బ్లాగ్ లో ఆ కవిత కూడా పెడ్తున్నాను.. :D
ఇన్ని కన్నీళ్ళు ఎక్కడ నుండి  వస్తున్నాయి అనే గోదావరి డైలాగ్ గుర్తొస్తుంది...





కవిత ఎక్కడ పోతుందో అని అది కూడా ఇక్కడ పెడ్తున్నాను జ్యోతి గారి పర్మిషన్ తో.. :)..థాంక్స్ జ్యోతి గారు.. :)


 సంతోషంగా ఉన్నవేళ
నన్ను స్పృశించ సాహసించవు
సమూహంలో ఉండగా
నన్ను పలకరించ భయపడేవు.....

కాస్త దిగులుగా ఉన్నంతనే
నేనున్నానంటూ తడిమేస్తావు
ఒంటరిగా బెదిరి ఉన్న సమయాన
జడివానలా, జలపాతంలా కమ్మివేస్తావు....

నా మనసులో , భావనలలో
అలుముకుని, అల్లుకుపోయిన దుఃఖమా!
ఆనందంలో పలకరించేవు, ఆవేదనలో తోడుండేవు
ఎంత అణచిపెట్టినా, అడ్డు చెప్పినా కంటి కొనలో నిలిచేవు...

ఉప్పెనలా నన్ను చుట్టేసి
భావోద్వేగపు వెల్లువను శాంతపరిచేవు
తుఫానులో చిగురుటాకులా నన్ను వణికించే
దుఃఖమా? నాపై ఇంత ప్రేమ ఎందుకమ్మా???


Comments

Pranav Ainavolu said…
ఎక్కడో చదివినట్టు గుర్తు...
"ఏ జ్ఞాపకం మోసుకోచ్చిందో ఈ కన్నీటి చుక్క...
కన్నుల్లో పుట్టి
చెక్కిలి పై నుంచి జారి
పెదవులను తడిమి
ఆవిరైపోయింది"
నా బాధను తీర్చింది!
Sri Valli said…
Very good drawing and poem..:)
రాధిక said…
ur wrk s so awesome :-))

Popular Posts